Homeజిల్లాలునిజామాబాద్​RSS Armoor | దేశరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి..

RSS Armoor | దేశరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి..

దేశరక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఇందూర్​ విభాగ్​ కార్యనిర్వాహక దిగంబర్​ జీ పేర్కొన్నారు. ఆర్మూర్​ పట్టణంలో నిర్వహించిన పథ సంచలన్​లో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: RSS Armoor | దేశ రక్షణకు ప్రతిఒక్కరూ ముందుండాలని ఇందూర్ విభాగ్ కార్యనిర్వాక దిగంబర్ జీ అన్నారు. పట్టణంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలన్ నిర్వహించారు.

పట్టణంలోని పెర్కిట్ భైరవ గుట్ట నుంచి ఒక బృందం, ఆర్మూర్ పోచమ్మ ఆలయ కమాన్ నుంచి మరో బృందంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు (RSS workers) పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ (Jambi Hanuman Temple) ప్రాంగణం వరకు పథ సంచలన్ నిర్వహించారు. దారి పొడవున మహిళలు, యువకులు పూలు చల్లుతూ వారికి స్వాగతం పలికారు. అనంతరం జంబి హనుమన్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్మూర్ నగర కార్యనిర్వాహక్​ పోల్కం నారాయణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Must Read
Related News