అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు (Alumni Students) ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. స్థానిక స్నేహ ఫంక్షన్ హాల్లో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. 42 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఆంజనేయులు, మంజూర్ హైమద్, కృష్ణమూర్తిని సన్మానించారు.
