Alumni Reunion
Alumni Reunion | అపూర్వ సమ్మేళనం

అక్షరటుడే, ఆర్మూర్‌: Alumni Reunion | మండలంలోని అంకాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో (Ankapur ZP High School) ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం (alumni reunion) నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన 2010–11 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు అంతా ఒక్కచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి మిత్రులతో కలిసి బాల్యం రోజులు గుర్తు చేసుకున్నారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. అలాగే తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వెంకట నర్సయ్య, సుదర్శన్, భూమేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు.