అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని విశ్వశాంతి హైస్కూల్ 2004–05 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక వంశీ హోటల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా అంతా ఒక్కచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో తమ గురువులను ఘనంగా సన్మానించారు.