అక్షరటుడే, కోటగిరి: Alumni Reunion | పోతంగల్ (Pothangal) మండల జడ్పీహెచ్ఎస్ 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం జరుపుకున్నారు. స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యనేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో గురువులు శ్రీరాం, రామిరెడ్డి, మందాకిని, దుర్గా, సంతోష్, నాగం సాయిలు, గజానంద్, సుదర్శన్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.