అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని చంద్రశేఖర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) 2007–08 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
సుమారు 18ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వవిద్యార్థులు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. విద్యనభ్యసించే సమయంలో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు చేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు పండరి, సుజాత, రజిని, మీనా, జ్యోతి, ఆనంద్‌రావు, ప్రకాశ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.