అక్షరటుడే, ఇందూరు: Alumni reunion | నాడు గోడలపై, బెంచీలపై చెక్కిన పేర్లు.. నేడు మదిలో చెరగని జ్ఞాపకాలు.. చిన్ననాటి అల్లరి స్నేహానికి గుర్తు.. పాఠశాల ఒడి..
ఎన్నో ఏళ్ళ స్నేహ బంధం.. ఒకే గొడుగు చెంతకు చేరిన మిత్ర బృందం.. నాటి చిలిపి చేష్టలు.. నేడు పెదవులపై విచ్చుకున్న చిరునవ్వులు.. క్రమశిక్షణ నేర్పిన గురువులు.. గత స్మృతుల మెరిసే కాంతులు..
ఆనందంలో ఉప్పొంగిన కన్నీళ్లు.. బోసి నోట చిరు నగవులు.. మధురమైన అనుభూతుల మరపురాని క్షణాలు.. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుక.
Alumni reunion | అపురూప ఘట్టం

Alumni reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అపురూప ఘట్టం (unique event) చోటుచేసుకుంది. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ ఇందుకు వేదిక అయింది.
ఆర్మూర్‌లోని జడ్పీహెచ్ఎస్ 1966 బ్యాచ్ పన్నెండో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సతీసమేతంగా (enthusiastically) పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.
నాటి గురువులైన హిందీ బోధకులు రాజయ్య గుప్తా, సైన్స్ మాస్టారు Science Master మల్లారెడ్డిని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సన్మానించుకున్నారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఒరేయ్.. అని ఒకరు.. ఏంట్రా అని మరొకరు.. జీవిత చరమాంఖానికి చేరుకున్న వయసులో తమ చిన్ననాటి స్నేహితులను చూసి చంటి పిల్లలయ్యారు. ఒకరినొకరు పలకరించుకుని సంబరంగా గడిపారు.
ఆలింగనం చేసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. దూరమైన (childhood friends) స్నేహితులను గుర్తుచేసుకున్నారు. తాము జీవితంలో ఎదిగిన తీరును పంచుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆచార్య డా. దశరథ్, జేడీ జయరాజ్ స్వామి, డాక్టర్ ఎల్లారెడ్డి నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులను ఒకే వేదికపైకి చేర్చి, తీపి జ్క్షాపకాలను అందించారు.