Homeజిల్లాలునిజామాబాద్​Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

భీమ్​గల్​ మండలంలోని గోన్‌గొప్పుల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 2002–03 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్: Alumni Reunion | మండలంలోని గోన్‌గొప్పుల జెడ్పీ ఉన్నత పాఠశాలలో (Gongoppula ZP High School) ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 2002–03 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్క చోట కలుసుకున్నారు.

22 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం (Alumni Reunion) ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి మిత్రులతో రోజంతా సరదాగా గడిపారు. చదువుకున్న రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శ్రీనివాస్, వెంకటరమణ, కృష్ణస్వామి, ఇంద్రసేనా రెడ్డి, లింబగిరి, ప్రసాద్, రాములు, వినోద్, రాజేశ్వర్, నవీన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రవీణ్‌ గౌడ్, మూర్తి ముదిరాజ్, మజర్, నవీన్, ఖలీం, భూమేశ్వర్, జగన్, చంద్, జమున, సుమతి, షబానా, సుమలత, కృష్ణవేణి, శ్రీలత, గంగనర్సు, వరలక్ష్మి, సుమలత, కవిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.