HomeతెలంగాణAlumni Reunion | సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Alumni Reunion | సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Alumni Reunion | జక్రాన్‌పల్లి మండలం (Jakranpally mandal) మునిపెల్లిలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2008–09 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఒక్క చోట కలుసుకున్నారు.

తమ చిన్ననాటి మిత్రులతో (childhood friends) కలిసి సందడిగా గడిపారు. పాఠశాల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవినాథ్, కృష్ణ, దిలీప్, సాయికుమార్, శ్యాంభట్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.