అక్షరటుడే, నిజాంసాగర్: Alumni Reunion | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలకు చెందిన 2013-14 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు. అలాగే గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, కిష్టారెడ్డి, సర్వేశ్వరరావు, రామ్మోహన్, లాల్ సింగ్, జల్లయ్య, రేణుక, నాగరాజు, శ్యామల, సరిత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
