అక్షరటుడే, ఇందూరు:Alumni Friends | నగరంలోని వాసు హైస్కూల్(Vasu High School) 1994–95 బ్యాచ్ ఎస్సెస్సీ బ్యాచ్(SSC Batch) పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగర శివారులోని ఓ హోటల్లో వారంతా ఒక్కచోట కలిశారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము ఈ స్థాయిలో ఉండటానికి ఆనాడు గురువులు(Teachers) చెప్పి విద్యాబుద్ధులే కారణమని ప్రసంగాల్లో పేర్కొన్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.