ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​EAMCET | ఇప్పటికే 10 లక్షల మంది కంప్యూటర్​ సైన్స్ నిరుద్యోగులు.. అయినా ఎంసెట్​లో దానికే...

    EAMCET | ఇప్పటికే 10 లక్షల మంది కంప్యూటర్​ సైన్స్ నిరుద్యోగులు.. అయినా ఎంసెట్​లో దానికే ప్రాధాన్యం.. భవిష్యత్తులో మార్కెట్​ను ఏలే రంగం ఏమిటి..?

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: EAMCET | తెలంగాణలో TS EAMCET (TG EAPCET) 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐటీ రంగంలో (IT sector) ఉజ్యల భవిష్యత్తు ఉంటుందని తమ తల్లిదండ్రులు కంప్యూటర్​ సైన్స్ బ్రాంచిలోనే (computer science branch) చేర్పించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ఎంసెట్​ కౌన్సెలింగ్​లో భాగంగా బ్రాంచి ఎంపికలో దీనికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తర్వాత ఐటీ, ఈసీఈ, ఈఈఈ.. ఇలా ఇచ్చుకుంటున్నారు.

    ఇక, కంప్యూటర్​ సైన్స్(computer science)లోనూ ఎక్కవగా ఏఐ, డేటా సైన్స్ (AI and data science) లాంటి స్పెషలైజేషన్​ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో అసలు మార్కెట్​లోని పరిస్థితిని ఓసారి అనాలిసిస్​ చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు చేసుకునే బ్రాంచి ఎంపికనే రేపటి రోజు వారి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

    EAMCET | తెలంగాణ రాష్ట్రంలో

    ఏటా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది ఇంటర్​ విద్య పాసవుతున్నారు. ఇందులో 75 శాతానికి పైగా ఎంపీసీ విద్యార్థులే (MPC students) ఉంటున్నారు. వీరిలో సుమారు లక్ష మంది వరకు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల్లో (engineering colleges) చేరుతున్నారు. ఐఐఎస్సీ, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐసర్​ తదితర వాటిల్లో చేరేవారి సంఖ్య మరో 10 వేల వరకు ఉంటుందని అంచనా.

    కాగా, ఈ సంవత్సరం ఎంసెట్ లో ఇంజినీరింగ్ విభాగానికి (engineering department) 2 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఇంజినీరింగ్​ సీట్లు ఉన్నాయి. కాగా, అత్యధికంగా CSE లో 28,435 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) లో 16,209 సీట్లు ఉండటం గమనార్హం. ఇక CSE (AI & ML) లో 13,470, CSE (డేటా సైన్స్) లో మరో 8,910 సీట్ల వరకు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) లో మాత్రం 7,440 సీట్లు ఉన్నాయి.

    ఐటీ రంగంలో (IT sector) రూ.లక్షల్లో వేతనం ఉండటంతో అందరూ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, దేశంలో ఏటా దాదాపు నాలుగు లక్షల మందికి పైగా కంప్యూటర్​ సైన్స్ అభ్యర్థులు డిగ్రీ పట్టా అందుకుని బయటకు వస్తున్నారు. కానీ, వీరిలో ఎంత మందికి ఉపాధి లభిస్తుందనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదు. వీరిలో కొలువుల్లో చేరేది కేవలం 5 శాతం మాత్రమే ఉంటున్నారంటే అతిశయోక్తి కాదంటున్నారు నిపుణులు.

    EAMCET | కరోనా తర్వాత…

    కొవిడ్​ మహమ్మారి (Covid pandemic) ప్రపంచ జన జీవనాన్ని అతలా కుతలం చేసిన తర్వాత.. అంటే దాదాపు నాలుగేళ్ల క్రితం ఐటీ రంగంలో 4 లక్షల మందికి గాను, 3.50 లక్షల మందికి ఉపాధి లభించింది. కానీ, ఈ సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని ఈ రంగంలోని వారే చెబుతున్నారు. గతేడాది ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య కేవలం 20 వేలు మాత్రమే ఉండటం ఆందోళనకరం. మరి మిగతావారి పరిస్థితి ఏమిటన్నది ఎవరూ దృష్టి సారించలేకపోతున్నారు.

    EAMCET | ఐటీ రంగంలో కొలువు రావాలంటే…

    ఐటీ రంగంలో అయితే లక్షల్లో వేతనాలతో కొలువులు అయితే ఉన్నాయి. కానీ, ఏఐ వచ్చాక ఈ రంగంలో అయితే నిరుద్యోగిత శాతం (unemployment rate) పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ రంగం సంక్షోభంలో పడిందంటున్నారు. మరో పరిశోధనలో ఈ రంగంలో ఉద్యోగాలు ఉన్నా.. ఆ స్థాయిలో అభ్యర్థులకు నైపుణ్యాలు లేకపోవడం వల్ల కొలువులు అందుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

    కంప్యూటర్​ సైన్స్(computer science)లో బ్రాంచిలో చేరిన వారు మొదటి ఏడాదిలోనే కోడింగ్​ పక్కాగా నేర్చుకోవాలని, రెండో ఏడాది ప్రాజెక్టులు, మూడో ఏడాది ఇంటర్న్​షిప్​లు, నాలుగో ఏడాది కొలువులపై దృష్టి సారిస్తే.. జాబ్​ పక్కా అని అంటున్నారు.

    EAMCET | కంప్యూటర్​ సైన్స్ విద్యార్థులకు భవిష్యత్తు ఉందా..?

    కంప్యూటర్​ సైన్స్ అనేది సుమారు 25 ఏళ్ల క్రితం వచ్చిన బూమ్​గా చెబుతున్నారు. ఈ పాతికేళ్లలో ప్రపంచాన్ని ఐటీ రంగమే (IT sector) ఏలుతోందని చెప్పాలి. కానీ ఇటీవలికాలంలో ఈ రంగం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. అందుకే ఈ రంగంలో నిరుద్యోగిత పెరుగుతోంది. ఈ క్రమంలోనే మన దేశంలో సుమారు 10 లక్షల మంది వరకు కంప్యూటర్​ సైన్స్ నిరుద్యోగులు ఉన్నట్లుగా చెబుతున్నారు.

    EAMCET | భవిష్యత్తు ఏరంగానిది..?

    సుమారు 60 ఏళ్ల క్రితం ఆటోమోబైల్​ (Automobiles) ఎంట్రీ ఇచ్చింది. ఈ రంగంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కాలగమనంలో ఐటీ రంగం రావడంతో ఆటోమోబైల్ రంగానికి (automobile sector) క్రేజీ తగ్గిందనే చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగం మళ్లీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ వెహికళ్ల (electric vehicles) ఎంట్రీతో ఈ రంగంలో కొత్త జీవం కొనసాగుతోందంటున్నారు. రాబోయే కాలంలోనూ ఈ రంగముదే హవా కొనసాగనుందని నిపుణులు చెబుతున్నారు.

    EAMCET | ఏఐ ప్రాధాన్యం..

    ఇక, ఐటీ రంగాన్ని ఏఐ శాసిస్తున్న నేపథ్యంలో.. ఇంజినీరింగ్ లోని అన్ని బ్రాంచుల్లోనూ ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్ టెక్నాలజీ (Artificial Intelligence technology) దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్ తోపాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టమనేలా చేస్తోంది. బ్రాంచి ఏదైనా విద్యార్థులు ఏఐ మీద దృష్టి పెడుతున్నారు. ఇంజినీరింగ్ (engineering) చేస్తూనే… ఏఐ కోర్సు నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

    More like this

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....