510
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో (Mahalaxmi Nagar) పలు ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాలనీలో రావుట్ల ప్రణీత్గౌడ్, అశోక్ గౌడ్ ఇళ్లల్లో అల్ప్రాజోలం ఉన్నట్లు పక్కా సమాచారంతో నార్కోటిక్(Narcotic police), ఆర్మూర్ పోలీసులు (Armoor Police) సంయుక్తంగా సోదాలు చేశారు.
Armoor | 500 గ్రాముల అల్ప్రాజోలం స్వాధీనం
ఈ సందర్భంగా సుమారు 500 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం వారిరువురిపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ దాడుల్లో నార్కోటిక్ సీఐ పూర్ణేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.