అక్షరటుడే,బోధన్: Excise Department | నిషేధిత అల్ప్రాజోలం (Alprazolam) ఉత్ప్రేరకాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లాల్ గ్రామంలోని ముస్తాబాద్ వీరాగౌడ్ ఇంట్లో నిషేధిత అల్ప్రాజోలం ఉన్నట్లు సమాచారం మేరకు దాడులు చేసి 200 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని బోధన్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు (Bodhan Excise Police Station) తరలించారు. సోదాల్లో ఎస్సై స్వప్న, నరసింహాచారి, రామ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుళ్లు రామ్బచ్చన్, గంగారాం, సాయికుమార్ పాల్గొన్నారు.
