Homeజిల్లాలునిజామాబాద్​Aloor | ఆలూర్ వాసికి డాక్టరేట్ ప్రదానం

Aloor | ఆలూర్ వాసికి డాక్టరేట్ ప్రదానం

భిక్కనూరు సౌత్​ క్యాంపస్​లో చరిత్ర విభాగంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న పోతన్నకు డాక్టరేట్​ వరించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆయన గురువారం డాక్టరేట్​ పట్టాను అందజేసింది.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూరు మండల (Aloor mandal) కేంద్రానికి చెందిన ఇస్సపల్లి పోతన్నకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్​ అందజేసింది. ‘మధ్యయుగ దక్కన్ పాలకులు – సైనిక వ్యవస్థ (1000-1724)’ అనే అంశంపై పోతన్న పరిశోధన జరిపారు.

ఈ అంశానికి గాను ప్రొఫెసర్ జి.అంజయ్య గైడ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పోతన్న తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) సౌత్ క్యాంపస్, భిక్కనూరులో చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను ఆలూరులో, డిగ్రీని నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీలో (Giriraj College) చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్​డీ పూర్తిచేశారు. తన విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగిందని, డాక్టరేట్ పొందడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పోతన్న తెలిపారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, గురువులకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.