అక్షర టుడే, ఆర్మూర్: Armoor | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి (ACP Venkateswar Reddy) అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ఆర్మూర్ అర్బన్ క్రీడలు (Armoor Urban Games) ప్రారంభమయ్యాయి.
పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల (government and private schools) క్రీడాకారులు హాజరై మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ఉత్తమ మార్చ్ ఫస్ట్ విజేతలకు ఏసీపీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈవో రాజ గంగారాం, హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, పీడీ మల్లేష్ గౌడ్, ఉపాధ్యాయులు దయాసాగర్, విజయ్ కుమార్, పీఈటిలు, విద్యార్థులు పాల్గొన్నారు.