అక్షరటుడే, ఇందూరు: Youth Festival | ప్రతి విద్యార్థి విద్యతో పాటు కళల్లోనూ రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ (Additional Collector Kiran Kumar) పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ (District Youth Sports Department) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలు, కళల్లోనూ (sports and arts) రాణించాలన్నారు.
ప్రతిఒక్కరిలోనూ ఏదోఒక అంశంలో ప్రతిభ ఉంటుందని ఆ టాలెంట్‌ను వెలికి తీస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్రస్థాయిలోనూ తమ సత్తా చాటాలన్నారు. అనంతరం కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ విద్యార్థులు బాగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అలాగే చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. క్రీడలు, కళలలో కూడా పాల్గొని రాణిస్తూ జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. అనంతరం పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Youth Festival | విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి: అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్