అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Allu Sirish | అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించాడు. గత అక్టోబర్ 31న తన గర్ల్‌ఫ్రెండ్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శిరీష్, 2026 మార్చి 6న ఆమెను వివాహం చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సాధారణ ప్రకటన మాదిరిగా కాకుండా, అన్న అల్లు అర్జున్ (Allu Arjun) పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌తో పాటు పెద్దన్న కూతురితో కలిసి ట్రెండింగ్ సాంగ్‌కు రీల్ చేసి పెళ్లి డేట్‌ను రివీల్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Allu Sirish | అన్న పెళ్లి రోజునే తమ్ముడి పెళ్లి!
రీల్లో పిల్లలు సరదాగా “సంగీత్ ఎప్పుడు బాబాయ్?” అని అడగగా, దానికి శిరీష్ “మనం సౌత్ ఇండియన్స్ కదా… మనం సంగీత్ లాంటివి చేసుకోము” అంటూ నవ్వులు పూయించాడు. ఈ కామెంట్ ఇప్పుడు అభిమానుల్లో మరింత చర్చకు దారితీస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం కూడా మార్చి 6వ తేదీన జరగడం. 2011 మార్చి 6న అల్లు అర్జున్ పెళ్లి జరిగింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అదే రోజున అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టనుండటం అల్లు కుటుంబంలో ప్రత్యేక విశేషంగా మారింది.
హైదరాబాద్‌లో (Hyderabad) పుట్టి పెరిగిన నయనిక ఓ బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన యువతి. అల్లు శిరీష్ – నయనిక లవ్ స్టోరీ ఎలా మొదలైంది అన్న విషయాన్ని శిరీష్ స్వయంగా సోషల్ మీడియాలో (Social Media) వివరించాడు. 2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందుగా నితిన్ – షాలిని ఇచ్చిన ఓ పార్టీకి తాను వెళ్లానని, అక్కడే షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనికను తొలిసారి కలిసినట్లు వెల్లడించాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని, రెండేళ్ల తర్వాత ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తన పిల్లలు “నాన్నా, మీరు అమ్మను ఎలా కలిశారు?” అని అడిగితే ఇదే కథ చెప్పుకుంటానని భావోద్వేగంగా రాసుకొచ్చాడు శిరీష్.
View this post on Instagram
Allu Sirish | సినీ ప్రయాణం ఇలా…
2013లో ‘గౌరవం’ సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠితో కలిసి చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’తో మంచి హిట్ అందుకున్నాడు. 2022లో అను ఇమ్మాన్యూయెల్‌తో కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’లో నటించాడు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చినా, అవి కేవలం రూమర్లేనని తర్వాత తేలింది. 2024లో ‘బడ్డీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్, తన 12 ఏళ్ల సినీ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 8 సినిమాలే చేయడం విశేషం.