HomeసినిమాAllu Sirish | ఈఫిల్ ట‌వ‌ర్ నుండి త‌న ప్రేయ‌సిని ప‌రిచ‌యం చేసిన అల్లు శిరీష్‌.....

Allu Sirish | ఈఫిల్ ట‌వ‌ర్ నుండి త‌న ప్రేయ‌సిని ప‌రిచ‌యం చేసిన అల్లు శిరీష్‌.. ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Sirish | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొద‌లు కానుంది. త్వ‌ర‌లో అల్లు శిరీష్ ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ ఇద్దరు కొడుకులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్‌గా ఉన్న అల్లు శిరీష్(Allu Sirish) మ‌రి కొద్ది రోజుల‌లోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. ప్రస్తుతం 38 ఏళ్ల వయస్సులో ఉన్న శిరీష్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానుల నుంచి సినీ వర్గాల దాకా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో, ఆయన పెళ్లికి సంబంధించిన ఒక‌ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Allu Sirish | నిశ్చితార్థం పూర్తి..

రెడ్డి కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని శిరీష్ ప్రేమించాడ‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకోనున్నాడ‌ని ప్ర‌చారాలు సాగాయి. ఈ క్ర‌మంలో శిరీష్ కొద్ది సేపటి క్రితం శుభ‌వార్త అందించాడు. తాను ఓ అమ్మాయితో నిశ్చితార్థం జ‌రుపుకున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అలానే ఈఫిల్ టవర్(Eiffel Tower) వద్ద తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి చేయి పట్టుకొని చేతుల మధ్యలో ఈఫిల్ టవర్ కనపడేలా దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గుడ న్యూస్ అందించాడు అల్లు శిరీష్. ఈ రోజు త‌న తాత‌య్య అల్లు రామలింగయ్య గారి జ‌యంతి సందర్భంగా నా మనసుకు దగ్గరైన ఒక న్యూస్ మీకు చెప్తున్నాను. నా నిశ్చితార్థం నైనికా(Nainika)తో జరిగింది. మా నానమ్మ కొద్ది రోజుల క్రితం మరణించింది. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని క‌ల‌లు అనుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంతో స్వీకరించాయి అని చెప్పుకొచ్చాడు.

నైనికా హైద‌రాబాద్ అమ్మాయి కాగా, సైలెంట్ గా ఇరు కుటుంబసభ్యుల మధ్య పారిస్ లో వీరి నిశ్చితార్థం(Engagement) జరిగినట్టు స‌మాచారం. కాగా, నైనిక రెడ్డి కాగా, అల్లు అర్జున్ కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన స్నేహ రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అల్లు శిరీష్ కూడా అదే కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండ‌డం విశేషం. గతంలో శిరీష్ పేరుతో పలు ప్రేమ సంబంధాల పుకార్లు రాగా, వాటన్నింటినీ ఆయన ఖండిస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పారిస్‌లో నిశ్చితార్థం జరిగినట్లు, ఆ అమ్మాయి పేరు నైనికా అని, ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫోటోతో అధికారికంగా శిరీష్ ప్రకటించడంతో అల్లు అభిమానులు ఆనందంతో ఉన్నారు. ఈ కొత్త జంట పెళ్లి ఎప్పుడు జరగబోతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.