అక్షరటుడే, హైదరాబాద్: Allu Sirish engagement | సినీ నటుడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడి నిశ్చితార్థం వైభవంగా జరిగింది.
ఇక పెళ్లిపీటలు ఎక్కడమే తరువాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ engagement వేడుకలో శిరీష్ – నయనిక రింగ్స్ మార్చుకున్నారు.
ఈ ఎంగేజ్మెంట్ engagement విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అల్లు శిరీష్ పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అనే క్యాప్షన్‌ను అల్లు శిరీష్ ఇచ్చారు.
Allu Sirish engagement |
కాగా, అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
ఇటీవలే భారీ వర్షం వల్ల తన నిశ్చితార్థానికి అటంకం కలిగినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా అల్లు శిరీష్ వెల్లడించారు. ఈ రోజు (అక్టోబరు 31) వాతావరణం అనుకూలించడంతో ఎంగేజ్మెంట్ తతంగం ముగించారు.
అల్లు అరవింద్ కుమారుడిగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun సోదరుడు శిరీష్. ‘గౌరవం’ (2013) చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. శ్రీరస్తు శుభమస్తు Shubhamastu, కొత్త జంట Kotha Jatna, ఒక్క క్షణం Okka Kshanam, ఏబీసీడీ ABCD, ఊర్వశివో రాక్షసివో Urvashivo Rakshasivo, బడ్డీ Buddy తదితర సినిమాలు చేశాడు.

