అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allu Arjun | పుష్ప (Pushpa) చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలు అందుకుంటూ.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన ఈ హీరో పుష్ప చిత్రంతో ఎనలేని పాపులారిటీ అందిపుచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే (South India) కాక మనోడికి నార్త్‌లోనూ విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. పుష్ప సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు (National Best Actor Award) అందుకున్న హీరోగా కూడా అల్లు అర్జున్ సత్తా చాటాడు. ఇప్పుడు బన్నీ నటించిన పుష్ప చిత్రంలోని పాటలకు, డైలాగులకు ఆయన అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు.
Allu Arjun | ఎంత అవమానం..
ఇంటర్నేషనల్ లెవల్‌లో స్టార్‌డం సంపాదించిన బన్నీకి (Allu Arjun) ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఘోర అవమానం జరిగింది. మాస్క్, గ్లాసెస్ పెట్టుకొని ఎయిర్ పోర్ట్‌లోకి (Mumbai Airport) ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. చెకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న అధికారి బన్నీని మాస్క్ తీయమని అన్నాడు. ముందు కాస్త తటపటాయించిన తప్పని పరిస్థితులలో మాస్క్ తీసి ఫేస్ చూపించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా, దీనిపై నెటిజన్స్ డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బన్నీని గుర్తు పట్టలేదని అవమానం జరిగిందని అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.
బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో (Atlee direction) ప్రస్తుతం AA 22 (వర్కింగ్ టైటిల్) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించి అలరించనున్నట్టు సమాచారం. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అర్జున్ స్క్రీన్‌పై చేసే సందడి పీక్స్‌లో ఉంటుందట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. హాలీవుడ్‌కు (Hollywood) చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పని చేయనుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్లు టాక్. దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన హీరోయిన్లకు సంబంధించి జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ బోర్సే అని అనుకుంటున్నారట. క్లారిటీ రావాల్సి ఉంది.
ముంబై ఎయిర్‌పోర్టులో అల్లు అర్జున్‌కు అవమానం
బన్నీని గుర్తించని సిబ్బంది#mumbaiairport #airport #AlluArjun𓃵 #AA22 pic.twitter.com/5LPeqRdQ6M— Akshara Today (@aksharatoday) August 10, 2025
