Allu Arjun
Allu Arjun | హై ఓల్టేజ్ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ సినిమా.. దిల్ రాజు ప్ర‌య‌త్నాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | సినీ ఇండ‌స్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపొంద‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ (Salar) సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫేవరెట్ డైరెక్టర్ అయ్యారు ప్రశాంత్ నీల్. ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ వరకు.. హీరోలు అందరూ రెడీ. అయితే అతని దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా నిర్మించేందుకు ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ‘కేజీఎఫ్’ (KGF) వంటి సంచలన హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ స్టైల్‌కు కొత్త లెవెల్ వచ్చేసింది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’తో (Pushpa 2) దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

Allu Arjun | నిజమెంత‌?

ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తే వేరే లెవ‌ల్‌లో ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఈ కాంబో కోసం దిల్ రాజు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు (Dil Raju) నిర్మించిన ‘గేమ్ చేంజర్’ (Gamr Changer) ఆశించిన విజయం సాధించలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.‌ దాంతో మరో భారీ సినిమా చేసి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ‘దిల్’ రాజు ట్రై చేస్తున్నారు. ఆయనకు ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ (Allu Arjun) ప్రామిస్ చేశారట.

అల్లు అర్జున్ ప్రామిస్ చేయడంతో ఆయనకు సరిపడా డైరెక్టర్ వేటలో దిల్ రాజు పడ్డారు. గతంలో ఆయనకు ఒక సినిమా చేస్తానని ప్రశాంత్ నీల్ ప్రామిస్ చేశారట. అయితే అడ్వాన్స్ వంటిది ఏమీ దిల్ రాజు ఇవ్వలేదు. ప్రశాంత్ నీల్ తీసుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రశాంత్ నీల్(Prashant neel) సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో (Prashant neel Direction) సినిమా అయితే నేషనల్ వైడ్ క్రేజ్ ఉంటుందని ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ‘దిల్’ రాజు. త్వరలో హీరో, దర్శకుడు మధ్య ఒక మీటింగ్ అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బ‌న్నీ ఆ తర్వాత‌నే ప్ర‌శాంత్ నీల్‌తో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.