Allu Arjun | అల్లు అర్జున్ టీ ష‌ర్ట్‌పై నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా కోట్.. ఇదెక్క‌డి మాస్ మామా అంటున్న ఫ్యాన్స్
Allu Arjun | అల్లు అర్జున్ టీ ష‌ర్ట్‌పై నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా కోట్.. ఇదెక్క‌డి మాస్ మామా అంటున్న ఫ్యాన్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల ఏం చేసిన సెన్సేష‌న్ అవుతోంది. ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pavan Kalyan)కి స‌పోర్ట్ చేయ‌కుండా వైసీపీ(YCP) వ్య‌క్తికి స‌పోర్ట్ చేయ‌డం ఎంత సెన్సేష‌న్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక పుష్ప‌–2 ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో బ‌న్నీ లేని పోని స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డం, జైలుకి కూడా వెళ్ల‌డం జ‌రిగింది. అయితే త‌న‌కి ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ వ‌స్తున్నారు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటూ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తున్నారు. రీసెంట్‌గా వేవ్స్(Waves) కార్య‌క్ర‌మానికి హాజ‌రై ఆ త‌ర్వాత ఒక చిట్ చాట్‌లో త‌ను ఎన్ని స‌వాళ్ల‌ని అధిగ‌మించాడో చెప్పుకొచ్చాడు.

Allu Arjun | ఇదేంది మామ‌..

ఇక ఇదిలా ఉంటే బ‌న్నీ ఎయిర్ పోర్ట్ విజువల్స్(Airport Visuals) బయటకు వచ్చాయి. బన్నీ ఒక వైట్ టీ షర్ట్ వేసుకొని ఈ టీ షర్ట్ మీద ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్​లో రాసి ఉంది. అలాగే బ్రహ్మనందం ఆ సీన్​లో నవ్వించే హావభావాల ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో బన్నీ వేసుకున్న టీ షర్ట్ వైరల్​గా మారింది. ఇది చూసిన వారంద‌రు కూడా బ‌న్నీ మాములు మాస్ కాదుగా అంటున్నారు. ప్ర‌స్తుతానికి ఎయిర్‌పోర్ట్‌లో బ‌న్నీ విజువ‌ల్స్ సోష‌ల్ మీడియా(Social Media)ని షేక్ చేస్తున్నాయి.

పుష్ప–2(Pushpa–2) తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని అందరు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్ర‌మ్‌తో చేస్తాడా, అట్లీతో చేస్తాడా అని అనుకుంటున్న స‌మ‌యంలో ఫ్యాన్స్ అంచనాలకు మించి అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). అట్లీ కూడా సౌత్ లో సినిమాలు చేస్తూ చేస్తూ బాలీవుడ్ బాద్​షా షారుఖ్​తో జవాన్ అంటూ సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అట్లీ డైరెక్షన్(Atlee’s Direction) టాలెంట్ గుర్తించి అల్లు అర్జున్ త్రివిక్రమ్​ సినిమా పక్కన పెట్టి మరీ అతనితో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్​మెంట్ వీడియోనే అదిరిపోయింది.