Allu Arjun
Allu Arjun | మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో మూవీ చేసేందుకు సిద్ధ‌మైన బ‌న్నీ.. ఇదెప్పుడో మ‌రి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun డిమాండే వేరు. ఆయ‌న పుష్ప‌ 2తో భారీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌గా, ఇప్పుడు అట్లీ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని అనుకుంటున్నాడు. అయితే బ‌న్నీతో సినిమాలు చేయాల‌ని ముందుగా త్రివిక్ర‌మ్ అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. అట్లీతో చిత్రం(Atlee Movie) చేస్తున్నాడు బ‌న్నీ. ఈ మూవీ త‌ర్వాత బ‌న్నీతో సినిమా చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. ఈ మధ్యనే బన్నీ వాస్ .. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రాబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే అది త్రివిక్రమ్ మూవీ కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు. అసలు ఇలాంటి ఒక కాంబోను ఊహించలేమని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కాంబో ఏంటి.. ? బన్నీ ఏ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడా.. ? అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Allu Arjun | మ‌ల‌యాళ డైరెక్టర్‌తో..

బన్నీ ఇప్ప‌టికే టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ తో పనిచేసి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు మలయాళ హిట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ మలయాళ డైరెక్టర్ ఎవరో కాదు.. బాసిల్ జోసెఫ్(Basil Joseph). మలయాళంలో డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి విజయాలను అందుకుంటున్న బాసిల్ తోనే అల్లు అర్జున్ జతకట్టినట్లు తెలుస్తోంది. జయ జయ జయ జయహే సినిమాతో బాసిల్ తెలుగువారికి దగ్గరయ్యాడు. ఆ తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగువారిని ఫిదా చేసింది. సూక్ష్మ దర్శిని, పోన్ మాన్, మరణ మాస్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన మిన్నల్ మురళీ 2021 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది

నాలుగేళ్ళ తరువాత బాసిల్.. అల్లు అర్జున్ కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి.. కేరళలో ఎలాంటి ఫ్యన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ అయితే.. అక్కడ వారికి మల్లు అర్జున్. ఎవరి సినిమాలైనా మలయాళంలో ఆడతాయో లేదో తెలియదు కానీ, బన్నీ సినిమా మాత్రం కచ్చితంగా మలయాళంలో ఆడితీరుతుంది. ఇప్పుడు మలయాళ డైరెక్టర్ (Malayalam Director) తోనే బన్నీ సినిమా చేస్తున్నాడు అంటే వారికి పండగే అని చెప్పాలి. మ‌రో నాలుగు నెల‌ల్లో దీనిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.