అక్షరటుడే, వెబ్‌డెస్క్: Allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ‘పుష్ప 2: ది రూల్’ (pushpa the rule) ఘనవిజయం సాధించిన తర్వాత ఆయన ఏ సినిమా చేయబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ (director atlee) దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రంగం సిద్ధమైంది.
తాత్కాలికంగా ‘AA22 x A6’గా పేరు పెట్టిన ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త మేకోవర్ కి రెడీ అవుతున్నాడు. దీనికోసం బన్నీ ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ (bunnty special fitness training) కూడా తీసుకుంటున్నారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి వారితో పని చేసిన ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ (fitness trainer Lloyd Stevens) పర్యవేక్షణలో శారీరకంగా పూర్తిగా మారబోతున్నాడు.
Allu arjun | క్రేజీ న్యూస్..
చిత్రంలో బన్నీ రగ్గడ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ అట్లీ సృష్టిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండే విధంగా ఉంటారట.ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ (allu arjun dual role) పోషిస్తాడని అంటున్నారు. వాటిలో ఓ పాత్ర పూర్తి నెగెటీవ్ షేడ్స్‌తో ఉంటుందట. కథలో విలన్ కూడా ఆ పాత్రే అని సమాచారం. అంటే హీరో బన్నీనే.. విలనూ బన్నీనే. ఇంతక ముందే ఈ వార్త బయటకు వచ్చినా దీనిపై క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇందుకోసం బన్నీ కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇది అల్లు అర్జున్‌కు పూర్తిగా భిన్నమైన అవతార్ (allu arjun in different avatar) అని తెలుస్తోంది. కేవలం శరీర దారుఢ్యంతో కాకుండా, తన స్క్రీన్ ప్రెజెన్స్‌ను (allu arjun screen presence) పెంచేలా అర్జున్ పనిచేస్తున్నాడని సమాచారం.
స్టార్ హీరోలు ద్విపాత్రాభినయాలు చేయడం మనం చూశాం. అయితే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర (villain role) అయితే.. ఆడియన్స్‌కి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోలు దక్షిణాదిలో చాలా తక్కువమంది. పాత రోజుల్లో ఎన్టీఆర్ NTR, కృష్ణ krishna ఈ తరహా సాహసాలు చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ‘వాలి’ సినిమాలో అజిత్, ‘జై లవకుశ’లో తారక్ ఈ తరహా పాత్రలు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ (allu arjun) ఈ రిస్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
