అక్షరటుడే, వెబ్‌డెస్క్: Manchu Lakshmi | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తన క్యూట్ మేనరిజం, ఫన్నీ డైలాగ్స్‌తో అప్పుడప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తండ్రితో గడిపే సరదా క్షణాలు, తన ముద్దు డైలాగ్స్ బన్నీ షేర్ చేస్తే చాలు వాటికి నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. తాజాగా అల్లు అర్హ (Allu Arha), మంచు లక్ష్మిల (Manchu Lakshmi) మధ్య జరిగిన చిలిపి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వీడియోలో మంచు లక్ష్మి అర్హతో మాట్లాడుతూ.. నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావట కదా.. ఏంటి?” అంటూ ప్రశ్నించింది. దానికి వెంటనే అర్హ సరదాగా, “మీరు తెలుగువారేనా?” అని క్యూట్‌గా ఎదురు ప్రశ్న వేసింది.
Manchu Lakshmi | సరదా కామెంట్స్..
ఈ మాట విన్న మంచు లక్ష్మి కాస్త షాక్ అయినట్టుగా నవ్వుతూ.. “నేను తెలుగే పాపా! నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది?” అని అడిగింది. దానికి అర్హ అమాయకంగా,”మీ యాక్సెంట్ (Accent) అలా ఉంది.” అని చెప్పేసింది! ఈ మాటకు అక్కడ ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వేశారు. ఈ సరదా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోపై “అర్హది పర్ఫెక్ట్ టైమింగ్!, లక్ష్మి యాక్సెంట్‌కు సాలిడ్ కౌంటర్!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి తెలుగులో మాట్లాడే విధానాన్ని గతంలో నెటిజన్లు టార్గెట్ చేస్తూ పలు మీమ్స్, రీల్స్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అర్హ అడిగిన ప్రశ్న ఆ గత జోకులకు మరోసారి స్పార్క్ ఇచ్చిందనే చెప్పాలి.
అర్హ తన చిలిపితనంతో మరోసారి సోషల్ మీడియాలో (Social Media) దుమ్ము రేపింది. ఈ చిన్నారి తన ఎక్స్‌ప్రెషన్లతో అందర్నీ అలరిస్తోంది. త్వరలోనే వెండితెరపై అర్హను మరింతగా చూడాలనే ఆసక్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్హ తండ్రి బన్నీ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. చిత్రం హాలీవుడ్ రేంజ్‌కి వెళ్లనుందని ముచ్చటించుకుంటున్నారు.
🤣
Allu Arha had an innocent question
Watch the light hearted banter between Manchu Lakshmi and Allu Arjun’s daughter. pic.twitter.com/1UUdHtaqMl
— Telugu360 (@Telugu360) August 7, 2025