ePaper
More
    HomeసినిమాAllu Aravind | ఆ న‌లుగురిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉగ్ర‌రూపం.. అందులో తాను లేనన్న అల్లు...

    Allu Aravind | ఆ న‌లుగురిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉగ్ర‌రూపం.. అందులో తాను లేనన్న అల్లు అరవింద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో (Andhra Pradesh and Telangana) థియేటర్ బంద్‌కి నేతృత్వం వహిస్తున్న “నలుగురు”లో తాను లేనని నిర్మాత అల్లు అరవింద్ (producer Allu Aravind) స్పష్టం చేశారు.

    తాను కేవలం 15 థియేటర్లకు మాత్రమే యజమానినని పేర్కొంటూ, పవన్ కళ్యాణ్ సినిమాకు (Pawan Kalyan Movie) సంబంధించిన వివాదానికి తాను దూరంగా ఉన్నానని తెలిపారు. టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన ఊహించని రగడ విష‌యంలో పవర్ స్టార్ అందులోని ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయ‌న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ముందు టాలీవుడ్ (Tollywood) నుంచి ‘ఆ నలుగురు’ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు మూలాన తన సినిమాకే ఇబ్బంది తలపెట్టినట్టు అయ్యింది.

    Allu Aravind | నేనే లేను..

    పవన్ నుంచి కావాల్సిన సమయంలో అంతా హైక్స్ తీసుకొని చివరికి తన సినిమా సమయంలోనే ఇబ్బంది పెట్టి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అంటూ పవన్ హర్ట్ అయ్యిన మాట అందరికీ తెలిసిందే. ఇలా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ రచ్చ విషయంలో దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ (producer Allu Aravind) పెట్టిన ప్రెస్ మీట్ ఇందులో తాను చెప్పిన అంశాలు వైరల్ గా మారాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా (Pawan Kalyan Movie) వస్తుంది అంటే దానిని ఆపాలని దుస్సాహసం ఎవరైనా చేస్తారా? అది ఎవరైనా సరే ఆ దుస్సాహసానికి ముందడుగు వెయ్యకూడదు అని తెలిపారు. అలాగే ఇపుడు వైరల్ అవుతున్న ఆ నలుగురు అంశంపై కూడా స్పందిస్తూ దానికి తనకి సంబంధం లేదని నేను ఆ నలుగురులో లేను అంటూ అసలు క్లారిటీ కూడా ఇచ్చారు. దీనితో అల్లు అరవింద్ స్టేట్మెంట్ (Allu Aravind statement) ఇపుడు వైరల్ గా మారింది.

    పీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా (Telugu film) పెద్దలు కనీసం మర్యాదకైనా సీఎం చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం (Governament) ఏవిధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. తాను కూడా సినీ పరిశ్రమ (film industry) నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో టాలీవుడ్ పై ఎప్పుడూ సానుకూలంగా ఉండే పవన్ ఒక్కసారిగా ఉగ్రరూపం ప్రదర్శించడంతో తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేగింది.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...