HomeతెలంగాణNew Ministers | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే..

New Ministers | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New Ministers | కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురికి కొత్తగా మంత్రి పదవులు వరించాయి. వీరికి శాఖలు ప్రభుత్వం శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గడ్డం వివేక్​కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్.. అడ్లూరి లక్ష్మణ్​కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు.

మంత్రివర్గ విస్తరణ అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్​రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. తాను హైదరాబాద్​ రాగానే మంత్రులకు శాఖలు కేటాయిస్తానని తెలిపారు. తన వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తానని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హైదరాబాద్​ చేరుకున్న తర్వాత సీఎస్​ రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. కాగా.. కీలకమైన హోం, విద్యా శాఖలను ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకోవడం గమనార్హం.