Homeతాజావార్తలుMinister Azharuddin | మంత్రి అజారుద్దీన్​కు శాఖల కేటాయింపు

Minister Azharuddin | మంత్రి అజారుద్దీన్​కు శాఖల కేటాయింపు

ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్​కు ప్రభుత్వం తాజాగా శాఖలు కేటాయించింది. ఆయనకు మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థలు అప్పగిస్తూ సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Azharuddin | మంత్రి అజారుద్దీన్​కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల అజారుద్దీన్​ (Minister Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన జూబ్లీహిల్స్​ టికెట్​ ఆశించారు. అయితే కాంగ్రెస్​ ప్రభుత్వం గవర్నర్​ కోటాలో గతంలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. అయితే ఆ నియామకానికి ఇంకా గవర్నర్ ఆమోదం​ తెలుపలేదు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు ఇటీవల మంత్రి పదవి ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకున్న కాంగ్రెస్​.. ఆ వర్గం ఓట్ల కోసం అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చింది.

Minister Azharuddin | హైదరాబాద్​ నుంచి తొలిమంత్రి

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాలకు మంత్రి పదవి దక్కలేదు. రెండో సారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సమయంలో తనకు పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అడిగారు. అయితే ఆ సమయంలో సామాజిక సమీకరణలో ఆయనకు పదవి దక్కలేదు. తాజాగా జూబ్లీహిల్స్​ ఎన్నిక (Jubilee Hills Election) నేపథ్యంతో ప్రభుత్వం హైదరాబాద్​ నగరానికి చెందిన అజారుద్దీన్​కు పదవి ఇచ్చింది. అయితే ఆరు నెలలలోపు ఆయన ఎమ్మెల్సీ, లేదా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ నియామకం గవర్నర్​ దగ్గర పెండింగ్​లో ఉంది.

Minister Azharuddin | అజారుద్దీన్​ నేపథ్యం

మహమ్మద్​ అజారుద్దీన్​ హైదరాబాద్​ (Hyderabad)లో జన్మించాడు. భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఇండియా తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలతో బీసీసీఐ అతడిపై జీవిత కాల సస్పెన్షన్​ విధించింది. దీంతో 2000లో అతని క్రికెట్ కెరీర్ ముగిసింది. అయితే నిషేధంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. 2012లో జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. క్రికెట్​ నుంచి తప్పుకున్న తర్వాత అజారుద్దీన్​ కాంగ్రెస్​ పార్టీ (Congress Party)లో చేరారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్​ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.