Homeజిల్లాలునిజామాబాద్​Wine Shops | లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

Wine Shops | లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

నూతన ఎక్సైజ్​ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను 2,786 దరఖాస్తులు రాగా.. కలెక్టర్​ డ్రా తీసి లైసెన్స్​లను ఎంపిక చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Wine Shops | మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం నగర శివారులోని భారతి గార్డెన్స్​లో (Bharathi Gardens) లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ డ్రా కార్యక్రమం నిర్వహించారు.

Wine Shops | కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ..

నూతన ఎక్సైజ్​ పాలసీ (Excise Policy) నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2,786 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కోషాప్​ వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపులను ఖరారు చేశారు.

లక్కీడ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీడ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారతి గార్డెన్స్​తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Wine Shops | ఫీజు రూపంలో..

లక్కీడ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా ఎక్సైజ్​ శాఖ (Excise Department) నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది.