అక్షరటుడే, వెబ్డెస్క్: JEE Main 2026 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారు. నగరానికి చెందిన సామవేదం రఘు కపీష్ అక్షిత్ 99.9976982 పర్సెంటైల్తో, నియువ్ కొచెటా 99.9962271 పర్సెంటైల్తో టాపర్లుగా నిలిచారని అలెన్ సౌత్ జోన్ హెడ్ మహేష్ యాదవ్ తెలిపారు. వీరితో పాటు హైదరాబాద్ సెంటర్ నుండి ఏడుగురు విద్యార్థులు 99.9 పర్సెంటైల్, మరో 51 మంది 99 పర్సెంటైల్ కంటే ఎక్కువ స్కోరు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
JEE Main 2026 | దేశవ్యాప్తంగా అలెన్ జోరు
జాతీయ స్థాయిలోనూ అలెన్ విద్యార్థులు తిరుగులేని ఫలితాలను నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 100 పర్సెంటైల్ సాధించిన మొత్తం 12 మందిలో ఏడుగురు అలెన్ విద్యార్థులే కావడం విశేషం. ముఖ్యంగా కోటా విద్యార్థి కబీర్ చిల్లార్ 300కి 300 మార్కులతో రికార్డు సృష్టించగా.. అర్నవ్ గౌతమ్, శుభం కుమార్, భవేష్ పాత్ర వంటి పలువురు విద్యార్థులు 100 పర్సెంటైల్ క్లబ్లో చేరారని సీఈవో నితిన్ కుక్రేజా వెల్లడించారు. ఈ ఫలితాల పారదర్శకతను ప్రముఖ ఆడిట్ సంస్థ ‘ఈవై ఇండియా’ ధృవీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
JEE Main 2026 | శిక్షణే విజయానికి మూలం
విద్యార్థుల వ్యక్తిగత కష్టం, అలెన్ అందించే క్రమబద్ధమైన శిక్షణ, నిరంతర విశ్లేషణే ఈ గెలుపుకు పునాది అని హైదరాబాద్ సెంటర్ హెడ్ సౌరభ్ తివారీ పేర్కొన్నారు. అలెన్ అందించిన విద్యా వాతావరణం, అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే ఈ ఘనత సాధించగలిగానని టాపర్ ఎస్ఆర్కే అక్షిత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి సంబరాలు చేసుకున్నారు.