అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Cricket Association | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొందరు ప్లేయర్లకు ఫేక్ బర్త్ సర్టిఫికెట్‌లతో అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
టాలెంట్ ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టి, అర్హతలేని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజనిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరోసారి వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు, అవినీతి కేసులతో చర్చనీయాంశమవుతున్న ఈ సంస్థ ఇప్పుడు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల వ్యవహారంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇటీవల అనంత్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ Rachakonda పోలీస్ కమిషనర్ (CP) కి ఫిర్యాదు చేస్తూ.. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్‌ల్లో పాల్గొంటున్న పలువురు ప్లేయర్లు నకిలీ జనన సర్టిఫికెట్లు సమర్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
వాస్తవ వయసు కంటే తక్కువగా చూపించి HCAలో ఎంట్రీ సాధించేందుకు కొందరు ప్లేయర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Hyderabad Cricket Association | మరో వివాదం..
అనంత్ రెడ్డి Ananth Reddy ప్రకారం.. “టాలెంట్ ఉన్న ప్లేయర్లు అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు కోల్పోతున్నారు. HCA లోని కొందరు అధికారులు డబ్బు, ప్రభావం ఆధారంగా నకిలీ సర్టిఫికెట్లతో ప్లేయర్లకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలతో ఆరుగురు ప్లేయర్లపై BCCI బ్యాన్ విధించింది. అయినప్పటికీ, ఈ ఏడాది మళ్లీ వారికే అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యకరం..” అని ఆయన అన్నారు.
ఇక ఈ అంశంపై ఆయన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు. “ఫేక్ మరియు డబుల్ బర్త్ సర్టిఫికేట్ల మాఫియాను అరికట్టాలి. టాలెంట్ ఆధారంగా ఎంపికలు జరగాలి..” అని అనంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలతో HCA లో మళ్లీ కలకలం రేగింది. ఇప్పటికే అవినీతి, అంతర్గత వాదోపవాదాలతో వార్తల్లో నిలుస్తున్న అసోసియేషన్ Association పై కొత్తగా ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం మరింత ఒత్తిడి పెంచుతోంది.
మొత్తం మీద, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికీ అవినీతి నీడలోనే కొనసాగుతోందా..? అనే ప్రశ్న ఇప్పుడు క్రీడాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై హెచ్‌సీఏ ఏమైనా స్పందిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.