అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad Central Jail | గత కొన్నిరోజులుగా నిజామాబాద్ సెంట్రల్ జైలు అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జైలు సూపరింటెండెంట్ ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నారంటూ పలు వాట్సాప్ గ్రూప్‌లలో వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో ఈ వార్త సంచలనం సృష్టించింది.
Nizamabad Central Jail | కల్పితమైన ఆరోపణలు
కామారెడ్డి సబ్‌జైలులోని (Kamareddy Sub-Jail) ఓ జూనియర్ అసిస్టెంట్‌ను సూపరింటెండెంట్ లైంగికంగా వేధిస్తున్నారంటూ వార్తలు గుప్పుమనడంతో జైళ్ల శాఖ (Prisons Department) అలర్ట్ అయ్యింది. అసలు ఏం జరిగిందని వివరాలు సేకరించగా.. అసలు విషయం బయటకొచ్చింది. అలాంటి సంఘటనలేవి జరగలేదని స్పష్టమైంది.
స్వయంగా కామారెడ్డి జైలులోని జూనియర్ అసిస్టెంట్ ముందుకొచ్చి నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌పై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పత్రికాముఖంగా వివరణ ఇచ్చారు. ఎవరో కావాలని చేసిన ఆరోపణలు తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె విడుదల చేసిన ఉత్తరం ద్వారా స్పష్టం చేశారు. ఆ ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సదరు జూనియర్ అసిస్టెంట్ కామారెడ్డి సబ్ జైలు పర్యవేక్షణ అధికారికి ఉత్తరం అందజేశారు.