అక్షరటుడే, ఇందల్వాయి: Agriculture Department | రైతులు మొబైల్ యాప్ (mobile app) ద్వారా యూరియా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఇందల్వాయి మండలం వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో (Chandrayan Palli village) శుక్రవారం ఎరువుల గోదామును ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు.
Agriculture Department | ఐదెకరాల్లోపు రైతులు..
ఈ సందర్భంగా శనివారం నుండి రైతులకు కావాల్సిన యూరియా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఐదెకరాల్లోపు రైతులు రెండు దఫాలుగా యూరియా కొనుగోలు (urea purchase) చేయవచ్చని, 5ఎకరాల పైన ఉన్న రైతులు మూడు దఫాలుగా యూరియా కొనుగోలు చేయవచ్చని వివరించారు.
Agriculture Department | పదిహేను రోజుల తర్వాత..
మొదటిసారి బుక్ చేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాతే మళ్లీ యూరియా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మండలంలో ఎరువుల కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా ఉండేందుకు మొబైల్ యాప్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆయన వెంట రైతులు, సొసైటీ సిబ్బంది ఉన్నారు.