Homeబిజినెస్​Stock Market | అన్ని సెక్టార్లలో జోరు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

Stock Market | అన్ని సెక్టార్లలో జోరు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమవడానికితోడు మన దేశ క్యూ1 జీడీపీ(Q1 GDP) డాటా పాజిటివ్‌గా రావడం దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఊపునిచ్చాయి.

ట్రంప్‌ సుంకాలు(Trump Tariffs) చట్ట విరుద్ధమని యూఎస్‌ అప్పీల్‌ కోర్టు పేర్కొనడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి కనిష్టాల వద్ద కొనుగోళ్లకు పాల్పడ్డారు. దీంతో మూడు సెషన్ల తర్వాత ప్రధాన సూచీలు లాభాలబాట పట్టాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 19 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 6 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా క్రమంగా లాభాలను పెంచుకున్నాయి. స్వల్ప ఒడిడుదుకులకు లోనైనా.. పాజిటివ్‌గానే ముందుకు సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 79,818 నుంచి 80,406 పాయింట్ల మధ్య, నిఫ్టీ 24,432 నుంచి 24,635 పాయింట్ల మధ్య కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 554 పాయింట్ల లాభంతో 80,364 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 24,625 వద్ద స్థిరపడ్డాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,795 కంపెనీలు లాభపడగా 1,391 స్టాక్స్‌ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 129 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 113 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 4.72 లక్షల కోట్లమేర పెరిగింది.

అన్ని సూచీలు ముందుకే..

మార్కెట్‌ను బుల్స్‌ చేతుల్లోకి తీసుకోవడంతో అన్ని సెక్టార్లు(All sectors) గ్రీన్‌లోనే కొనసాగాయి. జీఎస్టీ సంస్కరణలపై ఆశలకు తోడు చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్‌ విషయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చన్న అంచనాలతో ఆటో షేర్లు పరుగులు తీశాయి. దీంతో బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌(Auto index) అత్యధికంగా ఆటో ఇండెక్స్‌ 2.68 శాతం పెరిగింది. కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 2.07 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 1.93 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 1.84 శాతం, పవర్‌ 1.80 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 1.68 శాతం, ఐటీ ఇండెక్స్‌ 1.65 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.60 శాతం, పీఎస్‌యూ 1.59 శాతం, ఇన్‌ఫ్రా 1.59 శాతం, యుటిలిటీ 1.47 శాతం, కమోడిటీ 1.46 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 1.20 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 1.02 శాతం లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.1.64 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.49 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.92 శాతం లాభాలతో ముగిశాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో, 7 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్‌ఎం 3.65 శాతం, టాటా మోటార్స్‌ 3.17 శాతం, ట్రెంట్‌ 2.71 శాతం, ఎటర్నల్‌ 2.23 శాతం, ఆసియా పెయింట్‌ 2.13 శాతం పెరిగాయి.

Top Losers : సన్‌ఫార్మా 1.87 శాతం, ఐటీసీ 0.99 శాతం, హెచ్‌యూఎల్‌ 0.44 శాతం, టైటాన్‌ 0.28 శాతం, రిలయన్స్‌ 0.24 శాతం నష్టపోయాయి.