అక్షరటుడే, ఇందూరు : Nizamabad | బీసీ రాష్ట్ర జేఏసీ (BC JAC) పిలుపు మేరకు ఈనెల 18న తలపెట్టిన బీసీ బంద్ (BC Bandh)కు అన్ని పార్టీలు, వర్గాలు మద్దతు తెలిపినట్లు జిల్లా జేఏసీ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్లో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, డాక్టర్లు, లాయర్లు, కార్మిక సంఘాలు, గంజి వర్తక సంఘం, దర్వాయి సంఘం, మర్చంట్ అసోసియేషన్, క్లాత్ అసోసియేషన్, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరందరు బంద్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ ఛైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, వైస్ ఛైర్మన్ బొబ్బిలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.