Waqf Amendment Bill
Waqf Amendment Bill | వక్ఫ్​ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలంతా పోరాడాలి

అక్షరటుడే, ఇందూరు: Waqf Amendment Bill | రైతు వ్యతిరేక బిల్లు కోసం ఢిల్లీలో రైతుల చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వక్ఫ్​ బిల్లుకు (Waqt Bill) వ్యతిరేకంగా ముస్లిలంతా పోరాడాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ (MLA Akbaruddin Owaisi) పిలుపునిచ్చారు.

వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Central Government) వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు చేసే వరకు తమ నిరసన తెలుపుతూనే ఉంటామని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం కావాలని బిల్లును పాస్ చేసిందన్నారు. కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా సెక్యులర్లు కూడా వక్ఫ్​ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు తెలపాలన్నారు. సమావేశంలో ముస్లిం లా పర్సనల్ బోర్డు(Muslim Law Personal Board) జిల్లా అధ్యక్షుడు ముఖీం, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Chairman of Urdu Academy) తాహెర్ బిన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్(MIM district president Fayaz), మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, అమర్ తదితరులు పాల్గొన్నారు.