Ex Mla Jeevan Reddy
Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | అమాత్యులంతా అవినీతి అనకొండలేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి(BRS District President Jeevan Reddy) అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమాత్యులు లేనిదే ఫైళ్లు కదలవని దీంతో ప్రతి మంత్రి పేషీలో అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే (Congress Governmnet) కమీషన్ల పాలన అని ఇందుకు మంత్రి కొండా వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మంత్రి సురేఖ (Minister Surekha) కామెంట్స్​పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తక్షణమే స్పందించాలని అయన డిమాండ్ చేశారు. పీసీసీ (PCC) అంటేనే ‘ప్రదేశ్ కరెప్షన్ సెంటర్​’ అని అన్నారు. కాంగ్రెస్ అవినీతి భాగోతాలపై సభా కమిటీ వేయాలని, సీబీఐ (CBI)చే విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.