అక్షరటుడే, ఇందూరు: Civil Services Sports | ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు ఈనెల 9, 10న హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ (District Youth Sports Officer) తెలిపారు.
జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఈనెల 3న జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో ఉదయం 10:30 ఉంటాయన్నారు. కావున జిల్లాలో ఆసక్తిగల సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.
Civil Services Sports | రాష్ట్రస్థాయి పోటీల్లో అంశాలివే..
హైదరాబాద్లోని(Hyderabad) జింఖానా మైదానంలో (Gymkhana ground).. ఈనెల 9,10వ తేదీలో అథ్లెటిక్స్(Athletics), బాస్కెట్బాల్(basketball), వెయిట్ లిఫ్టింగ్(weightlifting), హాకీ, ఎల్బీ స్టేడియంలో (LB Stadium).. షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్, యోగా అంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.