HomeతెలంగాణJubilee Hills Constituency | ‘జూబ్లీహిల్స్‌’పైనే అంద‌రి క‌న్ను.. పోటీకి సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

Jubilee Hills Constituency | ‘జూబ్లీహిల్స్‌’పైనే అంద‌రి క‌న్ను.. పోటీకి సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jubilee Hills Constituency | జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌ధాన పార్టీలు గురి పెట్టాయి. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో ఇప్ప‌టి నుంచి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath) హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఖాళీ అయిన ఈ స్థానంలో ఆర్నెళ్ల లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాన పార్టీ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ యోచిస్తుండగా, ఎలాగైనా ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాల‌ని అధికార (Congress Party) ప‌ట్టుద‌ల‌తో ఉంది. హైద‌రాబాద్‌లో ఉన్న బ‌లంతో ఈసారి జూబ్లీహిల్స్‌లో జెండా ఎగుర‌వేయాల‌ని బీజేపీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ కూడా రాక ముందే మూడు ప్ర‌ధాన పార్టీలు సీరియ‌స్‌గా కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది.

Jubilee Hills Constituency | కాంగ్రెస్ గురి..

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ద‌క్కించుకోవ‌డంపై కాంగ్రెస్‌ గురి పెట్టింది. అధికారంలో ఉండ‌డం క‌లిసి వ‌చ్చే అంశం కావ‌డంతో ఎలాగైనా సొంతం చేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. త్వరలో జరగబోయే ఉప ఎన్నికను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ఖ‌రారుపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని సొంతం చేసుకోవ‌డం ద్వారా.. గులాబీ పార్టీని మ‌రింత దెబ్బ కొట్టాల‌న్న ల‌క్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ పార్టీల‌ బలాబలాలు, విజ‌యావ‌కాశాల‌పై స‌ర్వే నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు, టికెట్‌ను ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కూడా విజ‌యం సాధించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. అయితే, ఆశావాహులు చాలా మంది ఉండ‌డం ఆ పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతోంది.

Jubilee Hills Constituency | సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ ఫోక‌స్‌..

మ‌రోవైపు, త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్(BRS Focus) పెట్టింది. ఎలాగైనా నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. మాగంటి గోపినాథ్ కుటుంబం నుంచి ఎవ‌రో ఒక‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టడం ద్వారా సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తోంది. అయితే, ఇది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న సందేహం కూడా ఆ పార్టీలో నెల‌కొంది. గ‌తంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభ‌వ‌మే అందుకుకారణం. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌డంతో పాటు ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ఉప ఎన్నిక‌లో బ‌రిలోకి దిగాల‌ని యోచిస్తోంది.

Jubilee Hills Constituency | సీరియ‌స్‌గా రంగంలోకి బీజేపీ

మ‌రోవైపు, ఉప ఎన్నిక‌ల్లో గెలిచి స‌త్తా చాటాల‌ని బీజేపీ(BJP) ఉవ్విళ్లూరుతోంది. హైద‌రాబాద్​లో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న కాషాయ పార్టీ.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో(Hyderabad Elections) స‌త్తా చాటింది. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభవం మూట‌గ‌ట్టుకుంది. కేవ‌లం సిట్టింగ్ స్థానం గోషామ‌హాల్ మిన‌హా మిగతా అన్ని చోట్ల ఓడిపోయింది. ఆ త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిలాగే హైద‌రాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిల‌బెట్టుకోగా, బీజేపీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. అయితే సికింద్రాబాద్(Secunderabad), మ‌ల్కాజ్‌గిరి(Malkajgiri) స్థానాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. జూబ్లీహిల్స్‌లో జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ వ‌చ్చే లోపు కొత్త అధ్య‌క్షుడి నియామ‌కం కూడా పూర్తి కానుంది. దీంతో నూత‌న సార‌థి ఎన్నిక త‌ర్వాత జ‌రిగే తొలి ఎన్నిక‌ల్లో గెలుపొందడం ద్వారా త‌న స‌త్తా నిల‌బెట్టుకోవాల‌ని యోచిస్తోంది. ఇందుకోసం బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం వేట ప్రారంభించింది.