7
అక్షరటుడే, ఇందూరు: BC Reservations | రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా ఏకమవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం(Telanagana BC sanshema Snagham) అధ్యక్షుడు బత్తిని రమణాగౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలో ఉమ్మడి నిజామాబాద్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై అగ్రకులాలు చేస్తున్న దాడిని తిప్పికొట్టాలన్నారు. బీసీ సమాజానికి జనాభా ప్రాతిపదికన 42శాతం రిజర్వేషన్లు సాధించాలంటే బీసీలంతా ఏకమై ముందుకు కదలాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి బీసీలకు ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
1 comment
[…] రిజర్వేషన్ల (BC Reservations) కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ […]
Comments are closed.