అక్షరటుడే, ఎల్లారెడ్డి: Collector Kamareddy | మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. ఈ మేరకు బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌కు సంబంధించిన సామగ్రిని పోలింగ్ సిబ్బంది ద్వారా కేంద్రాలకు తరలించే కార్యక్రమం పూర్తయిందన్నారు.
Collector Kamareddy | బాన్సువాడ మండలంలో..
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) , బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఇచ్చిన పోలింగ్ సామగ్రిని చెక్ లిస్ట్‌లో చూసుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లోని (Gram Panchayats) పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న తర్వాత పోలింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువును తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
Collector Kamareddy | పోలీసు బందోబస్తు మధ్య..
రిజర్వ్డ్ కౌంటర్లో ఎంతమంది అధికారులు రిపోర్ట్ చేశారో పరిశీలించి, అవసరమైన గ్రామ పంచాయతీల్లో వారికి విధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సిబ్బంది పోలీసుశాఖ ఎస్కార్ట్‌గా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈవో చందర్ ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.