More
    Homeక్రీడలుsurya kumar yadav birthday | హ్యాపీ బర్త్‌ డే SKY.. పుట్టిన రోజు నాడు...

    surya kumar yadav birthday | హ్యాపీ బర్త్‌ డే SKY.. పుట్టిన రోజు నాడు పాకిస్తాన్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఏం చేస్తాడో మరి..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surya kumar yadav birthday | టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ (surya kumar yadav birthday) ఇవాళ (సెప్టెంబర్ 14) తన 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన ప్రత్యేకమైన షాట్‌లతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న SKY, ఇటీవలి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)  గెలుపులో కూడా కీలక పాత్ర పోషించారు.

    31ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్య, అతి తక్కువ కాలంలోనే భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా ఎదిగారు. అభిమానులు ప్రేమగా ‘మిస్టర్ 360’ (Mr,360) అని పిలుచుకునే సూర్య, తన ఆటతీరుతో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.

    surya kumar yadav birthday | మిస్ట‌ర్ 360 ఏం చేస్తాడో మ‌రి..

    అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నాడు సూర్య‌. ఇప్పటివరకు సూర్య 16 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నారు.టీ20 అంతర్జాతీయల్లో ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కూడా సూర్య సొంతం.

    2022లో సూర్య 31 మ్యాచుల్లో 1,164 పరుగులు చేసి, ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 4 టీ20 సెంచరీలు బాదాడు. అతనికన్నా ఎక్కువ సెంచరీలు చేసిన వారు కేవలం ఇద్దరు మాత్రమే వారిలో రోహిత్ శర్మ (Rohit Sharrma) 5, గ్లెన్ మాక్స్‌వెల్ 5 ఉన్నారు.

    అతి తక్కువ సమయంలోనే టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్, భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని, అభిమానులు సోషల్ మీడియాలో (Social Media) శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ ప్ర‌త్యేక దినం రోజు సూర్య కెప్టెన్సీలో టీమిండియా జ‌ట్టు పాకిస్తాన్‌తో (Pakistan) కీల‌క మ్యాచ్ ఆడ‌బోతుంది. ఈ మ్యాచ్‌లో సూర్య ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    కాగా, పాకిస్తాన్‌పై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడ‌గా, ఆయ‌న చేసింది కేవలం 64 పరుగులు మాత్ర‌మే. బ్యాటింగ్ సగటు 12.80గా ఉంది. పాక్ పై సూర్య చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కేవలం 18 పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్‌తో సూర్య త‌న స‌త్తా నిరూపించుకోవాల‌ని భావిస్తున్నాడు.

    సెంచ‌రీ చేసి త‌న బ‌ర్త్‌డేని స్పెష‌ల్ మ‌ల‌చుకోవాల‌ని అభిమానులు కోరుతున్నారు. కాగా, సూర్యకుమార్ యాదవ్‌ గత సంవత్సరం కాలంలో చేసింది కేవ‌లం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే. 2024 అక్టోబర్ 12న హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై (Bangladesh) 75 పరుగులు చేసిన ఆయ‌న 10 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారీ స్కోరు చేయ‌లేక‌పోయాడు. కెప్టెన్‌గా స‌క్సెస్ అవుతున్నా, బ్యాట‌ర్‌గా విఫ‌లం అవుతున్నాడు.

    More like this

    Hyderabad | పెంపుడు కుక్కలతో వాకథాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | దేశంలో మొదటి సాంకేతిక ఆధారిత ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ, జూబ్లీహిల్స్‌లోని...

    Traffic Challans | దేశ వ్యాప్తంగా ఎన్ని చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Traffic Challans | దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్ల (traffic challans) విలువ తెలుసుకుంటే...

    Ram Charan – Upasana | సెకండ్ బేబి గురించి ఉపాస‌న షాకింగ్ కామెంట్స్.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan - Upasana | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన...