Homeభక్తిAlipiri footpath : అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో త‌నిఖీ

Alipiri footpath : అలిపిరి కాలినడక మార్గంలో అదనపు ఈవో త‌నిఖీ

- Advertisement -

అక్షరటుడే, తిరుమల: Alipiri footpath : తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ఏడవ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అద‌నపు ఈవో సీహెచ్‌. వెంకయ్య చౌదరి(TTD Additional EO Ch. Venkaiah Chowdhury) త‌నిఖీ చేశారు. టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీశాఖ అధికారులతో కలిసి వెంకయ్య కాలిబాట మార్గాన్ని పరిశీలించారు. న‌డ‌క‌దారిలో ఏర్పాటు చేసిన స్టాటిక్ కెమెరాలు(static cameras), మోషన్ సెన్సార్ కెమెరాల(motion sensor cameras) పనితీరును సమీక్షించారు.

అటవీ ప్రాంతంలో మానవ–వన్యప్రాణి(human-wildlife) ఘర్షణ సమస్యను ఎదుర్కొనడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై వెంకయ్య కొన్ని సూచనలు చేశారు. వెంట టీటీడీ నిఘా వీజీవో రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూదన్ ఇత‌ర అధికారులున్నారు.

Must Read
Related News