- Advertisement -
HomeతెలంగాణRailway Passengers | ప్రయాణికులకు అలెర్ట్​.. దసరా నేపథ్యంలో పలు రైళ్లకు తాత్కాలిక స్టాప్​లు

Railway Passengers | ప్రయాణికులకు అలెర్ట్​.. దసరా నేపథ్యంలో పలు రైళ్లకు తాత్కాలిక స్టాప్​లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Railway Passengers | దసరా (Dussehra) సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ (Hyderabad) నగరం నుంచి చాలా మంది స్వగ్రామాలకు వెళ్తుంటారు.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)​లో రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు తాత్కాలిక స్టాప్​ సౌకర్యం కల్పించింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆయా స్టేషన్లలో పలు రైళ్లు నిలుస్తాయని పేర్కొంది. దీంతో ప్రయాణికులు సికింద్రాబాద్​ స్టేషన్​కు రాకుండానే సమీపంలోని స్టేషన్​కు వెళ్లి రైలు ఎక్కాలని సూచించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లు హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో కూడా ఆగుతాయని ప్రకటించింది.

- Advertisement -

Railway Passengers | ఈ రైళ్లకు..

విశాఖపట్నం-లింగంపల్లి, హడప్సర్‌-కాజీపేటతో పాటు సహా ఆరు రైళ్లకు హైటెక్‌ సిటీ స్టేషన్‌లో తాత్కాలిక స్టాప్‌ సౌకర్యం కల్పించారు. నరసాపూర్-లింగంపల్లి, కాకినాడ టౌన్-లింగంపల్లి సహా మరో నాలుగు రైళ్లు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో నిలుస్తాయి. దానపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-దానపూర్ రైళ్లకు చర్లపల్లిలో తాత్కాలిక హాల్టింగ్​ సదుపాయం కల్పించారు.

హైదరాబాద్-CST ముంబై, సికింద్రాబాద్-రాజ్‌కోట్ సహా ఎనిమిది రైళ్లు లింగంపేట స్టేషన్​లో నిలుస్తాయి. ఆయా రైళ్లలో ప్రయాణించాల్సిన వారు సికింద్రాబాద్​ స్టేషన్​ వరకు రాకుండా సమీపంలోని ఆయా స్టేషన్లకు వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సికింద్రాబాద్​లో రద్దీని తగ్గించాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News