ePaper
More
    HomeతెలంగాణCyber Fraud | రైతులకు అలర్ట్​.. కేంద్ర పథకాల పేరుతో సైబర్​ దాడులు

    Cyber Fraud | రైతులకు అలర్ట్​.. కేంద్ర పథకాల పేరుతో సైబర్​ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు(Cyber ​​Criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో లింక్​లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక హెచ్చరికలు జారీ చేశారు. రైతులే లక్ష్యంగా సైబర్​ దాడులు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్​ ప్రారంభమైంది. దీంతో పెట్టుబడి కోసం రైతులు(Farmers) వివిధ మార్గాల ద్వారా డబ్బు సేకరిస్తుంటారు. అయితే సైబర్​ నేరగాళ్లు పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి(PM Kisan Samman Nidhi), ముద్ర లోన్స్​(Mudra Loans), సూర్య ఘర్(Suryagarh)​ పేరిట లింక్​లు పంపుతున్నారు. వాటిని ఓపెన్​ చేయగానే ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా నిధుల విడుదలకు కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో రైతు భరోసా(Rythu Bharosa) పేరిట కూడా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర లింక్​లు ఓపెన్​ చేయొద్దని, ఎవరికీ బ్యాంక్​ అకౌంట్​ వివరాలు చెప్పొద్దని పలు సూచనలు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...