అక్షరటుడే, వెబ్డెస్క్ : Srisailam Temple | కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ ఆలయాలకు బుధవారం తెల్లవారుజామున నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
శ్రీశైలం (Srisailam)లో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలను అధికారులు నిలిపివేశారు. కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి (Kartik Purnima), ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ రోజులలో మూడు విడతలుగా స్వామి వారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.
Srisailam Temple | ప్రత్యేక ఏర్పాట్లు
భక్తులు కార్తీక దీపాలు (Karthika Deepalu) వెలిగించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 31న కృష్ణమ్మకు నదిహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం నిర్వహించనున్నారు. భక్తులు మార్పులను గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Srisailam Temple | వేములవాడలో ఆర్జిత సేవలు బంద్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం (Rajarajeswara Swamy Temple)లో కార్తీక మాసం సందర్భంగా బుధవారం నుంచి ఆర్జిత నిలిపివేశారు. స్వామి వారి దర్శనానికి ప్రధాన ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. కోడె మొక్కులు, అభిషేకాలు, ఇతర మొక్కులన్నీ భీమేశ్వర ఆలయంలోనే చెల్లించాలి. వేములవాడ ఆలయం (Vemulawada Temple)లో అభివృద్ధి పనుల నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలోనే భక్తులు వివిధ పూజల్లో పాల్గొంటున్నారు.