Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | నగరవాసులకు అలెర్ట్​.. రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

Hyderabad | నగరవాసులకు అలెర్ట్​.. రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో రెండు రోజుల పాటు తాగు నీరు సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు హైదరాబాద్​ మెట్రో వాటర్​ సప్లై, సీవరేజీ బోర్డు(HMWS&SB) బోర్డు అధికారులు తెలిపారు.

న‌గరానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న గోదావ‌రి డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై పేజ్-1 ప‌థ‌కంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు పనులు చేపడుతున్నారు. వాల్వ్​ల మార్పిడి పనులు చేపట్టనున్న నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి 11న ఉదయం ఆరు గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

Hyderabad | తాగునీరు రాని ప్రాంతాలు

ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్‌పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకట్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమజిగూడ, ఫతేనగర్ సెక్షన్లకు నీరు రాదు. జూబ్లీహిల్స్, తాటిఖానాలోని కొన్ని ఏరియాలకు వాటర్​ సప్లై నిలిచిపోనుంది. ఏడో డివిజన్​లో లాలాపేట్, తార్నాకాలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా బంద్​ చేయనున్నారు. 9వ డివిజన్​లో కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భారత్‌నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కేపీహెచ్​బీ కాలనీ, బాలాజీనగర్, హస్మత్​పేట సెక్షన్లకు నీరు రాదు.

డివిజన్​ 12 పరిధిలో చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్​, 8వ డివిజన్​లో అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మాచ్చబోలారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, మౌలాలి రిజర్వాయర్ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

చర్లపల్లి, సాయిబాబానగర్, రాధికా సెక్షన్లు, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాలు, హౌసింగ్ బోర్డు సెక్షన్, మల్లాపూర్​లో కొంత భాగం, కొండాపూర్​కు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. మాధాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్లలోని కొన్ని ఏరియాల్లో నీరు రాదు. హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు, పొచారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్పకాలనీ రిజర్వాయర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్ సెక్షన్లకు నీరు రాదని అధికారులు తెలిపారు.

ట్రాన్స్‌మిషన్ డివిజ‌న్- 4 పరిధిలోని మెఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, గ్రామీణ నీటి సరఫరా ఆఫ్‌టేక్స్ ఆలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్) ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.