Homeక్రైంsteganography | వాట్సాప్‌లో కొత్త స్కామ్.. ఇమేజ్ క్లిక్ చేశారా, మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

steganography | వాట్సాప్‌లో కొత్త స్కామ్.. ఇమేజ్ క్లిక్ చేశారా, మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: steganography : ప్రతి ఒకరి జీవితంలో సెల్​ఫోన్ భాగం అయింది. అందులోనూ సోషల్ మీడియాలో ఒకటైన వాట్సప్ కీలకంగా మారింది. కొందరైతే రోజులో గంటల తరబడి వాట్సప్​లోనే గడిపేస్తున్నారు. ఇక అన్ని రకాల కంపెనీలతో సహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సెక్టార్లు సైతం వాట్సప్ పై ఆధారపడి తమ ఉద్యోగులు, సిబ్బందిని సమన్వయం చేస్తున్నాయి.

ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వాట్సప్(WhatsApp) లో కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతోంది. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఈ వాట్సప్​పై సైబర్​ నేరగాళ్లు(Cyber ​​criminals) కన్నేశారు. కొత్త మోసానికి తెరలేపారు. స్టెగనోగ్రఫీతో నిలువు దోపిడీకి పాల్పడుతూ వాట్సప్​ యూజర్లకు షాకిస్తున్నారు.

steganography : స్టెగనోగ్రఫీ అంటే ఏమిటంటే..

స్టెగనోగ్రఫీ (Steganography) అనేది ఒక డిజిటల్ సాంకేతికత(digital technology). దీని ద్వారా ఒక ఫైల్ (చిత్రం, ఆడియో, వీడియో) లో మరో రహస్య సమాచారం దాచొచ్చు. ఇది కొత్తదేం కాదు. ఆనాటి ప్రపంచ యుద్ధకాలం నుంచే వినియోగంలో ఉన్న సాంకేతికత. అయితే, ఇప్పుడు సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) ఈ టెక్నాలజీని తమ స్వార్థం కోసం వినియోగిస్తున్నారు. ఫొటో లాంటి ఫైళ్లలో మాల్వేర్ (వైరస్​) malware (virus)ని దాచిపెట్టి వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు.

steganography : ఎలా మోసం చేస్తారంటే..

వాట్సప్ ద్వారా సైబర్​ నేరగాళ్లు ఆకర్షణీయమైన ఫొటోలు / వీడియోలు పంపతారు. ఇవి కొత్త నంబర్ల నుంచి వస్తుంటాయి. ఆ ఫొటో, వీడియోలో స్టెగనోగ్రఫీతో దాచిన మాల్వేర్ కోడ్ ఉంటుంది. ఇది బయటకు కనిపించదు. సదరు ఫొటో డౌన్​లోడ్​ చేసిన వెంటనే ప్రమాదంలో పడినట్లే. ఆ ఫొటోను డౌన్​లోడ్​ చేసినప్పుడు, అందులోని బైనరీ కోడ్(binary code) మొబైల్ / కంప్యూటర్‌(mobile / computer)లో మాల్వేర్ ను రన్ చేస్తుంది.

steganography : డేటా హ్యాక్..

బైనరీ కోడ్​ మాల్వేర్​ రన్​ అవుతున్నప్పడు.. మొబైల్​ ఫోన్​కు వచ్చే OTPలు, బ్యాంకింగ్ యాప్ లాగిన్ వివరాలు(anking app login details), పాస్‌వర్డులు(passwords), వాలెట్ యాక్సెస్(wallet access).. తదితర వివరాలు అన్నీ సైబర్​ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.

steganography : తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాట్సప్ సెట్టింగ్స్‌లో తక్షణ మార్పులు చేయాలి. Auto-download నిలిపివేయాలి. అజ్ఞాత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను తక్షణమే డిలీట్ చేస్తే బెటర్​. ఫొటో, ఫైల్ డౌన్​లోడ్​ చేసే ముందు అది నమ్మదగినదేనా అని నిర్ధారించుకోవాలి. అపరిచిత లింకులు అస్సలు క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్‌లో ఆన్‌టైమి యాంటీవైరస్ / మాల్వేర్ స్కానర్(antivirus / malware scanner) ఉంచుకోవడం మేలు. ఇక బ్యాంకింగ్ యాప్‌లకు ప్రత్యేకంగా అప్‌డేటెడ్ సెక్యూరిటీ ఉంచుకోవడం మంచిది.

ఈ కొత్త రకం ఎత్తుగడ కేవలం ఫొటో డౌన్​లోడ్​ మోసం మాత్రమే కాదు.. ఇది ఓ ఖతర్నాక్ సైబర్ క్రైం. సాంకేతికంగా నిష్ణాతులైన నేరగాళ్లు, సాధారణ వినియోగదారుల అప్రమత్తత లేమిని ఆసరాగా చేసుకుని చేస్తున్న భారీ దోపిడీ. సో, డిజిటల్ భద్రత(digital security) మన చేతుల్లోనే ఉంది. కాబట్టి సైబర్​ మోసాలను గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి.