అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group-3 Exams | తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల రిలీజైన మెరిట్ లిస్ట్ పేర్లున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనుంది. ఈ ప్రక్రియ నవంబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా ఈ ప్రక్రియ నవంబర్ 26 తేదీ వరకు సాగనుంది. మెరిట్ లిస్ట్ పేర్లున్న అభ్యర్థులు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొంది. హాల్ టికెట్ల వారీగా పూర్తి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ (TGPSC Website)లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు వెంట తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి తెలిపారు.
Group-3 Exams | 1388 పోస్టులకు నియామక ప్రక్రియ
టీజీపీఎస్సీ (TGPSC) 1,388 గ్రూప్–3 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మెరిట్ జాబితా విడుదల కావడంతో అభ్యర్థులు రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని టీజీపీఎస్సీ సూచించింది.
Group-3 Exams | సర్టిఫికెట్ల వెరికేషన్ వివరాలు..
ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 10వ తేదీ నుంచి 26 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Certificates Verification)కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నంబర్ అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరవాలని తెలిపింది. అభ్యర్థులు ఏ రోజు, ఏ షెడ్యూల్‌లో ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుందనేది కూడా వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లో పాటు రెండు సెట్లు స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఫాంను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా.. కేటాయించిన తేదీల్లో వెరిఫికేషన్‌కు రాకపోతే… వారి అభ్యర్థిత్వాన్ని తదుపరి ప్రక్రియ కోసం పరిగణించరని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. వెరిఫికేషన్‌కు హాజరైన వారికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో పత్రాలు ఉన్నట్లయితే.. నవంబర్ 29 (రిజర్వ్ డే) సాయంత్రం 5 గంటల తర్వాత తీసుకోబోమని పేర్కొంది.
